Monday, 15 May 2017

తక్కళ్లపల్లి లో రైతుల అవగాహనా సదస్సు

తక్కళ్లపల్లి లో రైతుల అవగాహనా సదస్సు 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 15 ; (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలం లోని తక్కళ్లపల్లి గ్రామంలో సోమవారం మన తెలంగాణ -మన వ్యవసాయం రైతులకు అవగాహనా  సదస్సును  వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారిని మంజుల మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి రాష్ట్ర  ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా  నేడు ఏర్పాటు చేసిన రైతు సదస్సులను మండలం లోని అన్ని గ్రామా పంచాయితీ ల రైతులకు  అవగాహనా కల్పింస్తు చైతన్య పరుస్తున్నాం అన్నారు .  ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటిస్తూ  సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.  నాణ్యమైన విత్తనాలను  ఎంపిక చేసి గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలనే నాటితే ఎక్కువ దిగుబడులు వస్తాయని అన్నారు.తక్కువ రేటులో విత్తనాలను కొనుగోలు చేసి దిగుబడులు లేక రైతులు నష్టపోతున్నారని. రాయితీ ఫై ప్రభుత్వం ప్రవేశ పెట్టె విత్తనాలను నాటితే అధిక దిగుబడులు దోహద పడుతాయని అన్నారు. ఈ అవగాహన సదస్సులో  గ్రామ సర్పంచ్ చిన్నయ్య. వ్యవసాయ సిబ్బంది అర్చన. రవీందర్ తదితర రైతులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment