ఘనంగా మే డే ను జరుపుకున్న కార్మిక వర్గం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 1 (వుదయం ప్రతినిధి) ; మే 1 ప్రపంచ కార్మికుల దినోత్సవo సందర్బంగా సోమవారం రోజున రెబ్బెన మండల వ్యాప్తంగా సింగరేణి కార్మిక సంఘాలు,అసంఘటిత కార్మిక వర్గం 131వ మే డే ను ఘనoగా జరుపుకున్నాయి.ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి పాల్గొని ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించగా,గోలేటి బస్టాండ్ లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.జగ్గయ్య ఆవిష్కరించారు.అదే విధoగా గోలేటి క్రాస్ రోడ్డు,రెబ్బెన మండల కేంద్రంలో కూడా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే ను జరుపుకున్నారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ నాయకులూ మాట్లాడుతూ చికాగో అమరవీరుల పోరాట ఫలితమే నేడు కార్మికుల హక్కులు అని అన్నారు.ఆ రోజులలో ప్రతి కార్మికుడు 24 గంటలు పని చేయాలని కఠినపు చట్టాలకు వ్యతిరేకంగా సూమారు మూడు లక్షలకు పైగా కార్మికులు సమ్మెకు దిగితే అప్పటి చికాగో ప్రభుత్వం వారి పై అమానుషంగా దాడిని చేసి అనేక మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారని,ఆ రక్తపు మడుగులల్లో నుండి పైకి లేచిన ఒక కార్మికులు తెల్ల చిక్క ఎర్ర జెండా గ, ఆ రోజును మే డే గా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ,ఏఐవైఎఫ్,ఏఐఎస్ఎఫ్ నాయకులూ శేషసేయణరావు,పోచమల్లు,కోటి,రమేష్,శ్రీనివాస్,తిరుపతి,నాగులు,బోగే ఉపేందర్,రాయిల్ల నర్సయ్య,దుర్గం రవీందర్,పూదరి సాయిపటేల్,కస్తూరి రవి,దుర్గం తిరుపతి,పర్వతి సాయి,లింగమూర్తి,సంతోష్, జె.సాయి,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment