కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (వుదయం ప్రతినిధి) ; వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని రెబ్బెన ఎస్ ఐ నరేష్ కుమార్ అన్నారు.బుధవారం రెబ్బెన ప్రధాన రహదారిపై ప్రత్యేక వాహనా తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ వాహన చోదకులు విధిగా శిరస్త్రణ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు వాహన చోదక అర్హత పత్రాన్ని కలిగి ఉండాలి అని అన్నారు. అదే విధంగా వాహనాలకు సంబంధించిన దృవీకరణ పత్రాలు అయినా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్,లైఫ్ టాక్స్ వంటి రవాణాశాఖ ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.సరైన పత్రాలు లేని వాహన యజమానులకు జరిమానా విధించారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపకూడదని ఒక వేల నడిపినట్టైతే వారి తల్లిదండ్రులు శిక్షార్హులని హెచ్చరించారు.చోదకులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని అన్నారు.
No comments:
Post a Comment