Tuesday, 2 May 2017

వార్షికోత్సవం సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు

వార్షికోత్సవం సందర్బంగా  అమ్మవారికి  ప్రత్యేక పూజలు 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 02 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన  మండల కేంద్రం  లోని ఇందిరా నగర్ గ్రామంలో వెలసిన మహంకాళి దేవి స్వరూపం వార్షికోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు మరియు శ్రీ చక్ర హోమాలను,అన్న ప్రసాద కార్యక్రమలను ఏర్పాటు చేశారు. వార్షికోత్సవం సందర్బంగా దేవి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనునిత్యం విశేష పూజలు అందుకుంటున్నా దేవికి మండలంలోని భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల  నుండి ప్రతిరోజు భక్తులు వస్తూపోతూ ఉంటారు. గత నాలుగు సంవత్సరాల నుండి నిత్యం పూజారి దేవరా వినోద్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మే నెలలో మహంకాళి దేవత పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక పూజలు,కుంకుమార్చనలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షలు మోడెమ్ తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాథం సంజీవ్,జడ్పీటీసీ బాబురావు,సర్పంచ్ పెసారు వెంకటమ్మ,ఏఎంసీ ఉపాధ్యక్షురాలు శంకరమ్మ,ఉప సర్పంచ్ శ్రీధర్,నాయకులు పోటు  శ్రీధర్ రెడ్డి,మోడెమ్ సుదర్శన్  గౌడ్,చెన్నా సోమశేఖర్,పెసారు మధునయ్య,వెంకన్న,భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment