రెబ్బెన లో 83 శాతం ఉత్తీర్ణత సాధించిన పది విద్యార్థులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 03 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలం లో 83 శాతం పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు . మండలం లో 404 మంది విద్యార్హులు పరీక్షలు వ్రాయగా 333 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 322 విద్యార్థులకు 254 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ పాఠశాలలో 82 మందికి గాను 79 మంది ఉత్తీర్ణత సాధించారు. మండల టాపర్ అన్నపూర్ణ పాఠశాల కు చెందిన పి అనూష , k శివ, కే.వంశి కృష్ణారావు 9. 5 గ్రేడ్ ను సాధించారు. అలాగే గంగాపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన లెండుగురే శ్రీనివాస్ ,నంబాలా కు చెందిన మానస 9. 2 గ్రేడ్ ను సాధించారు. మండలం లోని కస్తూరిబా పాఠశాలలో 97 శాతం గంగాపూర్ 89 శాతం నంబాల , తుంగేడా 84 శాతం నవేగం రెబ్బెన 78 శాతం తక్కలపాల్లి 41 శాతం ఆశ్రమ ఉన్నత పాఠశాల 78 శాతం సింగరేణి పాఠశాల 94 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ వెంకటేశ్వర స్వామి తెలిపారు.
No comments:
Post a Comment