Wednesday, 3 May 2017

అర్హులైన వారికీ డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలి

అర్హులైన వారికీ డబుల్ బెడ్ రూమ్  కేటాయించాలి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 03 ; (వుదయం ప్రతినిధి) ; మేరు కులస్తులకు అర్హులైన వారికీ డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని ,మేరు సాంగ మండల అధ్యక్షులు బొమ్మినేని శ్రీధర్ కుమార్, రాయల నరసయ్య లు  బుధవారం తహసీల్దార్ రమేష్ గౌడ్ కి వినతి పత్రం ఇచ్చారు.  ప్రతి మేరు  కుటుంబానికి ఉచితంగా కుట్టు మిషిన్లు పంపిణి చేయాలన్నారు. మీరు కుటుంబాలను బిసి-డి నుండి బిసి-ఏ  లోకి మార్చాలి. నీరు పేద కుటుంబాలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. ప్రతి కుటుంబానికి 10లక్షల రుణాలు ఇవ్వాలి. రెబ్బెన మండలం లో పది గుంటల కమ్యూనిటీ హాలును కేటాయించాలి. మండలం లో నీరు పేదల కుటుంబాలకు 3ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలి. అరవై సంవత్సరాలు నిండిన నిరుపేదలకు పింఛన్ ఇవ్వాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కీర్తి మోహన్, రాపర్తి అశోక్, ఆత్మకూరి స్వామి, గందె కళ్యాణ్, ఆత్మకూరి తిరుపతి, మేడిశెట్టి సాగర్, ఆత్మకూరి నరేష్, బొమ్మినేని గిరిబాబు తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment