Monday, 1 May 2017

ప్రజల కోసమే కొమురం భీం జిల్లా పోలీసులు; ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

 ప్రజల కోసమే కొమురం భీం జిల్లా పోలీసులు; ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 1 (వుదయం ప్రతినిధి) ; అను నిత్యం ప్రజల శాంతి భద్రతలను కాపాడుతూ కొమురం భీం జిల్లా పోలీస్ లు ప్రజల  సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని ఎస్పి సన్ ప్రీత్ సింగ్  అన్నారు.  జిల్లా కేంద్రం లోని ఎస్పి కార్యలయం లో సోమవారము నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగం లో జిల్లా ఎస్పి ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువ ఫిర్యాదులు భూమి తగాదాల పైన రావడంతో ఫిర్యాదుదారుల తో మట్లాడారు. భూమి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి అని, అనవసరం అయిన కక్ష లను పెంచుకోకూడదు అని వాటి వల్ల కేస్ ల లో ఇరుక్కోటం యే కాకుండ తమ పైన ఆధారపడ్డ వారికీ అన్యాయం చేసిన వారు అవుతారని అన్నారు.  అవసరం అయితే కోర్ట్ ల లో పరిష్కరించుకోవాలని తెలిపారు. జిల్లా లో ఎక్కడ ఆయన  జరిగే నేరాల వివరాలు కానీ పిర్యాదులు కానీ నేరుగా తెలియచేయవచ్చుపేర్కొన్నారు.ఆలాగే సోషల్ మీడియా అయిన పేస్బూక్ మరియు వాట్స్అప్ (7995799002)  లో కూడా ఫిర్యాదు చెయవచ్చు అని తెలిపారు. జిల్లా లో నేరాలు చాలా వరకు తగ్గాయి అవి ప్రజల సహకార కృషితో నేరాలు తగ్గు ముఖం పట్టాయని అన్నారు. ప్రజాభివృద్ది కార్యక్రమాలలో  ప్రజలను భాగస్వాములను చేసే లా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం అని పేర్కొన్నారు. కార్యక్రమాలపై సిబ్బంది కి ప్రత్యేకం గా కౌన్సెలింగ్, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యామ్ సుందర్ , డిసీబీ ఎసై రామరావు ,అసిఫాబాద్ టౌన్  సీ ఐ సతీశ్ గారు ,ఎస్పి సీ సీ శ్రీనివాస్ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత గార్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment