Monday, 29 May 2017

ప్రజల బాగస్వామ్యం తో నే శాంతి భద్రతలు సాద్యం - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 ప్రజల బాగస్వామ్యం  తో నే శాంతి భద్రతలు  సాద్యం - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 29 ; (వుదయం ప్రతినిధి) ;    జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయము లో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు  సోమవారం నాడు ప్రజా ఫిర్యాదు ల కార్యక్రమం ను నిర్వహించారు ,ప్రజా ఫిర్యాదుకార్యక్రమంకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లా పోలీసులు శాంతి భద్రతల తో పాటు గా  జిల్లా లోని మారుమూల ప్రాంతాల లోని ప్రజలతో మమేకం అయి వారికీ , నేరాలు మోసాలు పట్ల అవగాహన కలిపిస్తూ వారిని చైతన్య వంతులను చేసే ల కార్యక్రమాలను చేపడుతున్నామని,జిల్లా లోఫ్రెండ్లీ పోలీస్ నెలకొని వుందని ఈ స్నేహ పూరిత వాతావరణం ను ఇలాగే కొనసాగిస్తామని  ఇక పై సమస్యల పైన వారి బాగాస్వామ్యం తో ముందుకు వెళ్లి వారికీ న్యాయం  చేకురేలా ప్రయత్నిస్తామని తెలిపారు.అంతేకాక  కేసు పురోగతి లో వేగం పెంచేలా జిల్లా లోని మొత్తం పోలీసు స్టేషన్ లను cctns కింద అనుసందానము చేసి ఆదునికత ను అంది పుచ్చుకున్నాం అని ,దిని వల్లకేసు పురోగతి ,మరియు పారదర్శకత రెండు పెరిగి సత్వర న్యాయం బాధితుడికి అందుతుందని తెలిపారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల విబాగం లో ఎక్కువ కేసు లు భూసమస్యలపై రావటం జరిగింది ఫిర్యాదు దారులు తమ యొక్క సమస్యను జిల్లా ఎస్పి గారికి తెలుపగా ,సమస్యల పైన స్పందించిన జిల్లా ఎస్పి గారు ఆయా స్థానిక పోలీసు అధికారుల తో ఫోన్ లొ మాట్లాడి వారికీ  న్యాయం జరిగేల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రంలో ఎస్బిసీ ఐ వెంకటేశ్వరులు, ఎసై లు శివకుమార్, శ్యాం సుందర్ ఎస్పిసీసీ శ్రినివాస్, పి.ఆర్.ఓ మనోహర్ లు ఫిర్యాదుల విబాగం అధికారిని సునీత లు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment