ఆన్లైన్ మోసాలపై గిరిజనులకు అవగాహన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 26 ; (వుదయం ప్రతినిధి) ; యూవత చదువు ఫై ఆసక్తి పెంచుకుంటూ డిజిటల్ ఇండియా లో భాగస్వాములు అవుతూ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలను గమనిస్తూ నిరక్షరాసులను అవగాహన కల్పిస్తూ ఉండాలని జైనుర్ సీఐ . రవి కుమార్ అన్నారు. శుక్రవారం సిర్పూర్ యు మండలం లోని మహాగమ్ గ్రామం లో ఆన్లైన్ మోసాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. అలాగే అటవీ హక్కుల చట్టాలను ఏ విదంగా వినియోగించు కోవలో గిరిజనులకు వివరించారు. ముఖ్యంగ యూవత చెడు వ్యసనాలకు బానిసలూ కాకుడదని సన్మార్గంలో నడుచుకుంటూ చదువు ఫై ఆసక్తి చూపిస్తూ ఉన్నత శ్రేణులకు చేరాలని సూచించారు. యూవత పెద్దలకు నిరక్షరాసులకు చదువు చెప్పి వారికీ ఆన్లైన్ మోసాలు మరియూ బ్యాంకింగ్ గురించి తెలియ చేయాలనీ అన్నారు. సమాజం లో జీవించడానికి చదువు ఎంతో ముఖ్యం అని అందుచే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాత్రి బడులు సాక్షర భారత్ ఇలాంటి వసతులు వినియోగించు కొనేలా నిరక్షరసత వయోజనులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ .రామారావు సర్పంచ్ మరియు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment