Wednesday, 31 May 2017

అంకిత భావం తో విధులు నిర్వర్తిస్తేనే గుర్తింపు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 అంకిత భావం తో విధులు నిర్వర్తిస్తేనే  గుర్తింపు  - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30 ; (వుదయం ప్రతినిధి) ; విధి  నిర్వహణలో  అంకితబావం తో పని చేస్తేనే గుర్తింపు ఉంటుందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు ,సిబ్బంది ప్రజా సేవ యే పరమావధి గా చేసినవారి  సేవలను అమోఘమని అయన అబినందిచారు.బుధవారం జిల్లా లోని స్థానిక జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం లొ పదవి విరమణ పొందిన SD.మోగ్దము హెడ్ కానిస్టేబుల్ ఏ ఆర్  హెడ్ క్వార్టర్స్,  T.కిషన్ ఏ.ఎసై కాగజ్ నగర్ టౌన్  లను  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు శాలువ తో సత్కరించి పుష్ప గుచ్ఛము ను అందచేసీ  వారి సేవలను కొనియాడారు , వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో  ఆనందం తో గడపాలని అబిలాశించారు  మరియు  వారికీ రావలిసిన బెనిఫిట్స్ ను తక్షణం అందిస్తామని ఈ సందర్బంగా  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రంలో  ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్, ఎస్పిసీసీ శ్రినివాస్, హెడ్ క్వార్టర్ ఆర్ ఐ  వామనమూర్తి ,ఆర్ ఎసై యం.శ్రినివాస్ మరియు  పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment