కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 16 ; (వుదయం ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గొల్లకురుమల చేయూతనియ్యడం సంతోష కరం అని ఎం పి పి సంజీవ్ కుమార్ అన్నారు. యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై గొర్రల పెంపకానికి కి రెబ్బన మండలం లోని ఖైర్గం లో మంగళవారం 20 మంది లబ్ది దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 10 మంది ని ఎంపిక చేసారు. ఖైగాం గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కి ముఖ్య అతిధిగా ఎం పి పి సంజీవ్ కుమార్ హాజరు అయి మాట్లాడారు. లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సులోచన,ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, పశువైద్యాధికారి సాగర్. ఈఓపీఆర్డ్ కిరణ్ కుమార్,పంచాయితీ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment