జిల్లా పోలీసు అధికారులతో అడిషనల్ డి జి పి విడియోకాన్ఫెరెన్స్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 12 ; (వుదయం ప్రతినిధి) ; జిల్లా పోలీసు అధికారులు రాష్ట్ర అడిషనల్ డి జి పి జితేందర్ తో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విడియోకాన్ఫెరెన్స్ సమావేశంలో మాట్లాడారు, 14 జిల్లా లకు 35 లక్షల చొప్పున మంజూరుచేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రము లో ఏర్పటు చేయాల్సిన సీ సీ కెమెరా లు వంటి వాటి అవశ్యకత ను ఏర్పాటు ,నిర్వహణ కు కంట్రోల్ రూమ్ ఏర్పాట్లకు సంబందించిన శిక్షణను గురించి తెలిపారు. కుమరంభీమ్ జిల్లాకేంద్రం లో ఏర్పాటు చేయు సీ సీ కెమెరా లు వంటి వివరాలను కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ గారు విడియోకాన్ఫెరెన్స్ లో మాట్లాడి జిల్లా లో వాటి అవశ్యకత ను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమం లో అసిఫాబాద్ టౌన్ సీ ఐ సతీష్, కాగజ్ నగర్ టౌన్ సీ ఐ రమేష్ బాబు, ఎస్బి సి ఐ వెంకటేశ్వరులు, ఎన్ఐబీ ఐ/సి శ్యామ్ సుందర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment