Friday, 12 May 2017

రైతులు పంటలపై అవగాహనా పెంచుకోవాలి ; మన తెలంగాన-మన వ్యవసాయం

రైతులు పంటలపై అవగాహనా పెంచుకోవాలి ;  మన తెలంగాన-మన వ్యవసాయం 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 12 ; (వుదయం ప్రతినిధి) ;   మన తెలంగాన-మన వ్యవసాయం అవగాహన సదస్సు   రెబ్బెన మండలం లోని నంబాల మరియు నారాయణపూర్ లలో శుక్రవారం తహసీల్దార్ రమేష్ గౌడ్,  మండల వ్యవసాయాధికారిణి మంజులలు  అవగాహనా కల్పించారు. రైతులు పంటలపై అవగాహనా పెంచుకోవాలని, రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందాలన్నారు. ఆరుతారుతడి పంటలను వేసుకోవాలని సూచుంచారు . వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై వస్తున్నా విత్తనాలు,ఎరువులు, పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటించి, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల  వ్యవసాయంలో  అదిక దిగుబడి సాదించాలని రసాయన ఎరువులను వాడితే బుసారం దెబ్బతిని దిగుబడులు తక్కువకు కారణం అవుతాయి అని అన్నారు. రైతులు , పాడిపశువుల పెంపకం చేపట్టి ఆర్థికంగా ప్రగతి పథంలోకి సాధించాలని కోరారు. పంటలకు ఏవైనా వ్యాధులు సోకినట్లైతే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు.  ఈ అవగాహన సదస్సులో  గ్రామ సర్పంచ్ గజ్జల సుశీల,ఏ ఈ ఓ అర్చన, హెచ్ ఈ ఓ రమేష్, సింగల్ విండో డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ, వార్డ్ నెంబర్ శ్రేణీవాస్  తదితర రైతులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment