ప్రజాస్వామ్య పద్ధతి లో శాంతి యుతంగా హక్కులను సాధించుకోవాలి ; ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 06 (వుదయం ప్రతినిధి) ; ప్రజాస్వామ్య పద్ధతి లో శాంతి యుతంగా హక్కులను సాధించుకోవాలిఅని ,ఆక్రోశం తో అసహనం పెంచుకోని హింసా పద్దతులను అవలంభించడం వల్ల సాధించేది ,సాధించబోయేది శూన్యం అని కొమురంభీమ్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు ,శనివారం జిల్లా పోలీసు కార్యాలయము లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో నిషేధిత సీ పి ఐ మావోయిస్టు పార్టీ లో పని చేసి లొంగిపోయిన మావోయిస్టులు ,జిల్లా ఎస్పి గారిని కలిసి తమ యొక్క కష్టాలను ఎస్పి గారికి వివరించారు ,దీని పైన సానుకూలం గా స్పందించిన జిల్లా ఎస్పి గారు లొంగిపోయిన వారిని జిల్లా పోలీసులు ,ప్రభుత్వం లు అని విధాలుగా ఆదుకుంటాయని ,వీరి యొక్క సమస్యలను ప్రత్యేకము గా భావిస్తున్నాము అని కొన్ని వివరములు అసంపూర్తిగా ఉండటం వల్ల జాప్యం ఏర్పడుతుంది అని త్వరలోనే వీరి అందరితో ఒక సమావేశం ను నిర్వహించి వారి సమస్యలను జిల్లా కలెక్టరు ,ప్రభుత్వాల దృష్టి కు తీసుకుపోయి వారు కోరిన రీతి లో వారికి జీవనఉపాధి ను కలిపిస్తాం అని వారికి హమీ ను ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు, ,అసిఫాబాద్ టౌన్ సీ ఐ సతీశ్ గారు ,ఎస్పి సీ సీ శ్రీనివాస్ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment