Thursday, 4 May 2017

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపర్చిన నంబాల విద్యార్థిని

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపర్చిన నంబాల విద్యార్థిని 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 04 ; (వుదయం ప్రతినిధి) ;  పదవతరగతి పరీక్ష ఫలితాలలో నంబాల ఉన్నత పాఠశాల కి చెందిన ముడిపెల్లి మానస 9.2 గ్రేడ్ పాయింట్స్  సాధించడం పట్ల పాఠశాల SMC చైర్మన్ దెబ్బటి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు ఎమ్. వెంకటేశ్వర స్వామి విద్యార్థినిని అభినందించారు. మండలంలోని ప్రవేటు పాఠశాలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలల  విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని వారు అన్నారు అంతే కాకుండా మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచడం జరిగిందని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు.నంబాల ఉన్నత పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, విద్యార్థుల ఉత్తీర్ణత కోసం అహర్నిశలు కష్టపడిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఆర్పీ ఎమ్. రాజేష్ ,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment