ధర్నా చౌక్ ని ఎత్తి వేస్తే ఆందోనలు కొనసాగిస్తాం జె ఏ సి నాయకులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 13 ; (వుదయం ప్రతినిధి) ; ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ని తరలిస్తే ఊరుకోమని తెలంగాణ జె ఏ సి నాయకులూ ఎల్ రమేష్.బోగే ఉపేందర్ లు అన్నారు శనివారం రెబ్బన మండలం కేంద్రం లోని ఆర్ ఎం డి భవన ఆవరణలో ధర్నా చౌక్ కు సంబంధించిన వాల్ పోష్టర్లను విడుదల చేసి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును తరలించద్దని ధర్నా చౌక్ ఎత్తివేస్తే హైదరాబాద్ నగరం అంత ధర్నా చౌక్ గ మారుతుందని ధర్నా చౌక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల 15 వ తేదీన ధర్నా చౌక్ నిర్ణయిస్తామని అన్ని రాజకీయ పార్టీలు నాయకులూ విద్యార్థులు మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత మరింత స్వేచ్ఛ ఉంటుందని భావించామని అనుకున్నాం కానీ ధర్నా చౌక్ ని ఎత్తివేసి కేసీఆర్ ప్రజా స్వామ్యాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి మీ చర్యలు నిదర్శనం అని రాష్టం లో అన్ని వర్గాల ప్రభుత్వాల ఫై అసంతృప్తిగా ఉన్నాయని 20 ఏళ్లుగా ధర్నా చౌక్ గ ఉన్న ఈ [ప్రదేశాన్ని ఎత్తి వేయడం చాల బాధాకరం అని అన్నారు రాష్టం లో టీఆర్ఎస్ కేవలం రాజకీయ పరిపాలన చేస్తున్నారని ప్రజలకు మంచి కోరే పని చెయ్యడం లేదని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయల నర్సయ్య.బీజేపీ మండల అధ్యక్షుడు కుంధారపు బాలకృష్ణ. టీడీపీ మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్. కాంగ్రెస్ నాయకుడు కొవ్వూరి శ్రీనివాస్.పూదరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment