Tuesday, 16 May 2017

పంట మార్పిడితో బహు ప్రయోజనాలు

పంట మార్పిడితో బహు  ప్రయోజనాలు 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 16 ;  రెబ్బెన మండలంలోని నవేగం, వాంకులంలో మన తెలంగాణ మన వ్యవసాయం మంగళవారం నిర్వహించారు. బిటిఎం గురుమూర్తి,వ్యవసాయ అధికారి మంజుల లు  రైతులకు అవగాహనా కల్పించారు. పంట మార్పిడితో అధిక లాభాలు వస్తాయని అన్నారు. రసాయన ఎరువుల వడకాని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. రసాయన ఎరువులు వాడటం వాళ్ళ భూ సారం తగ్గుతుందని ఎప్పటి కప్పుడు పంట మార్పిడి చేసి అంతర పంటలు వేస్తే  రైతులు లాభాల బాటలో ప్రయాణించచ్చు  అన్నారు.  ప్రభుత్వం సబ్సిడీ పై విత్తనాలు మరియు కల్టివేషన్, డ్రిప్పింగ్ పైపులను వినియోగించుకోవాలన్నారు. ఈ సదసులో  వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment