Thursday, 4 May 2017

కృషి ఉంటె ఎంతటి అభివృద్ధినైనా సాధించవచ్చు ; మంత్రి జూపెల్లి కృష్ణారావు

కృషి ఉంటె ఎంతటి అభివృద్ధినైనా  సాధించవచ్చు  ;  మంత్రి జూపెల్లి కృష్ణారావు 



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 04 ; (వుదయం ప్రతినిధి) ;    గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిదులు ప్రజల సమిష్టి కృషి తోనే గ్రామాలూ అభివృద్ధి చెందుతాయని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఉపాధి హామీ గ్రామజ్యోతి కార్యక్రమ పరిశీలనలో భాగంగా నంబాల గ్రామ పంచాయతీ కి వచ్చారు . ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ గజ్జల సుశీల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధి హామీ కూలీలలతో మాట్లాడారు. ఉపాధి హామీ పనులు చేసి సంవత్సరం గడుస్తున్నా తమకు డబ్బులు రావడం లేదని కూలీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు . దీంతో  మంత్రి కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి పని కల్పించాలని లేని యెడల కూలి డబ్బులు చెల్లించాలని అధికారులకు సూచించారు. నంబాల గ్రామంలో 1234 జాబ్ కార్డులు ఉంటె 2,815 మంది పనులు చేయటం ఏమిటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు . లక్షలు ఖర్చు చేసిన రాణి విజ్ఞానం పత్రికలతో మరియు టెలివిజన్ తో  అందుతుందని  గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తులు కుటుంబం లోని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి వారి ఉన్నతికి సహకరించాలన్నారు. నియోజక మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి అందరికి పనులు కల్పించి అభివృద్ధికి సహకరించాలని అప్పుడే బంగారు తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటి వరకు గ్రామానికి 1కోటి 30లక్షల రూపాయిలు మంజూరు కాగా 34లక్షల పని కూడా చేయించలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు కాగితాల  మీద కనబడే పని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే చాల వ్యత్యాసాలు కనబడుతున్నయని పేర్కొన్నారు. ఎంపిడిఓ డిఆర్డిఓ . ఎపిఓ లు గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు కూలీల సమస్యలను కంప్యూటర్ లో అప్లోడ్ చేయవలసిందిగా సూచించారు నెలకు కనీసం 25రోజులు కూలీలకు పనులు కల్పించాలన్నారు . నీటి సమస్య అధికంగా ఉన్నచోట రైతుల బోరుబావుల వద్ద నుంచి కానీ వాటర్ ట్యాంక్ నుంచి నీటిని సరఫరా చేయాలన్నారు 15 రోజులకు ఒకసారి డ్రైనేజి కాల్వలు నుండి పూడిక తియ్యాలని అన్నారు . రిక్షాల ధ్వారా చెత్తను డంపు యార్డుకు చేర్చాలన్నారు . సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించక పోతే అధికారుల ఫై చర్యలు తప్పవని హెచ్చరించారు . పత్రిక ప్రసార మాధ్యమాధ ధ్వారా  ఈ  సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్,  ఎమ్మెల్యే కోవలక్ష్మి, కోనేరు కోనప్ప,  కలెక్టర్ చంపాలాల్,  ఆర్ వి కర్ణన్, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, డి ఆర్ డి ఓ శంకర్, కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నర్సింగోజు పద్మసత్యనారాయణ,  ఎం ఆర్ ఓ రమేష్ గౌడ్ ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ ఎం పి పి  సంజీవకుమార్ జెడ్ పి  టీ  సి ఏ  బాబురావు, రెబ్బన సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఏ  ఎం సి వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment