తెలంగాణ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్న సింగరేణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరేణి యాజమాన్యం ఘనంగా జరుపనుందాని డిజిఎం జె చిత్తరంజన్ కుమార్ శనివారం ఒక ప్రకటన ధ్వారా తెలిపారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా రెబ్బెన మండలంలోని గోలేటిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం 7:30 గంటలకు జి ఎం కార్యాలయం నుండి తెలంగాణ రన్ కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే బెల్లంపల్లి ,మాదారం, గోలేటిలలో మహిళలకు ప్రత్యేకంగా ఆటలాపోటీలు మరియు దీపాలంకరణ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి పాఠశాల ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. సింగరేణికి సంబందించిన స్టాల్స్ తో పాటు తెలంగాణ వంటకాల స్టాల్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవంలో పాలుపంచుకొని పండుగ వేడుకలను విజయవంతం చేయాలనీ కోరారు.
No comments:
Post a Comment