కిరోసిన్ పోసుకొని వ్యక్తి మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 22 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండల కేంద్రములో గోలేటి గ్రామా పంచాయత్ లోని దూల పెట్ కు చెందిన టేకు రాజు ( 25 ) ఆదివారం రోజున కిరోసిన్ పోసుకొని మృతి చెందినట్లు రెబ్బెన ఎస్ ఐ నరేష్ కుమార్ తెలిపారు. మృతుడి అన్న అయిన టేకు గోపాల్ పిర్యాదు మేరకు గతంలో మానసిక ఆవేదనతో పలు మార్లు ఆత్మహత్య కు పాల్పడ్డాడు, ప్రతిరోజు ఊర్లలో గ్యాస్ రిపేర్ చేసి ఇంట్లో ఉండేవాడు . గతంలో లాగానే ఆలోచనలకూ గురై ఆదివారం రోజు ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడగా 108 అంబులెన్సు లో బెల్లంపల్లి ఆసుపత్రి కి తరలించగా చికిత్స చేసి మంచిర్యాల ఆసుపత్రి కి పంపించారు . అక్కడ చికిత్స చేసి కరీంనగర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపియాడని బాధితుల అన్న పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
No comments:
Post a Comment