ఉపాధి హామీ కూలీలకు బకాయిల వేతనాలను చెల్లించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 23 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలం లోని గ్రామీణ ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న వారికీ గత రెండు నెలలనుంచి కూలి చెల్లించడం లేదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్.ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయాల నర్సయ్య లు . మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు గత సంవత్సరం లో కూడా ఇంకుడు గుంతల బకాయిలు కూడా చెల్లించకపోవడం తో అప్పులు చేసి నిర్మించారని అన్నారు.జాబ్ కార్డు ఉన్న వారందరికీ ఉపాధి కల్పించాలని అన్నారు.పని ప్రాంతం లో కనీస సౌకర్యాలు కల్పించకుండా నమమాత్రం గా కొనసాగిస్తున్నారని ఈ ఎండా వేడిని తట్టుకోవడానికి టెంట్లు . మెడికల్ కిట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఇవ్వాల్సి ఉండగా అధికారుల పట్టింపు లేని కారణంగా క్షేత్ర స్థాయిలో అందడం లేదు అన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరువ తీసుకొని సౌకర్యాలు కల్పిస్తూ కూలీల వేతనాలు చెల్లించాలి అన్నారు.
No comments:
Post a Comment