కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 1: కార్మిక హక్కుల సాధన కోసం ఈ నెల 8 9 తేదీన చేపట్టే దేశ వ్యాప్త సమ్మె లో అన్ని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,TRSKV జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్,మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాష్ రావు అన్నారు. మంగళవారం నాడు రెబ్బన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాల భవనం ఆవరణలో కార్మిక సంఘం నాయకులు దేశ వ్యాప్త సమ్మె వాల్ పోస్టర్లు విడుదల చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం అందించాలని, నెలకు కనీసం 18000/- జీతం అసంఘటిత కార్మిక వర్గానికి అందించాలని, నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించి అందుబాటులో ఉంచుతూ పేదల అవసరాలను తీర్చాలని అనేక సమస్యల పై సమ్మెను చేపడుతున్నామని అన్నీ వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, మండల కార్యాదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు గోగర్ల శంకర్, కోశాధికారి తిరుపతి, నాయకులు దేవాజి, వెంకన్న తోపాటు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment