Saturday, 12 January 2019

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నిబంధనల విరుద్దంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  12 :  పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోలేటి 1వ వార్డు  పోటీ అభ్యర్థి కడతల సాయి డిమాండ్ చేసారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం గోలేటి 1వ వార్డు  స్థానానికి అధికార పార్టీకి చెందిన గోగులోత్  రవినాయక్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇరవై అయిదు మందితో నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి నామినేషన్ దాఖలు చేయటం జరిగిందన్నారు ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలు చేయాల్సిన రిటర్నింగ్ అధికారులు  అవేవి పట్టించుకోకుండా పూర్తి సహకారం అందించారని ఆరోపించారు దీనికి తోడుగా గోలేటి పంచాయతీ కార్యదర్శి సైతం నామినేషన్ దాఖలులో భాగస్వామ్యం అవ్వటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు . వెంటనే అధికారులు స్పందించి రవినాయక్ అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి నిబంధనలకు వి విధులు నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ఎంపీడీవోను వివరణ త్వరగా ఎన్నికల కేంద్రం లోని ఎన్నికల  సిబ్బందికి ఏదో అవసరం ఏర్పడితే పంచాయతీ సెక్రెటరీ శంకర్ కేంద్రం లోపలికి వెళ్లాడు. అదే విదంగా రవినాయక్ దాఖలు చేసే  సమయంలో ఇతర అభ్యర్థులు సైతం నామినేషన్స్ వేసేందుకు కేంద్రంలోకి వచ్చారే తప్పా 25 మంది తో వెళ్లలేదని తెలిపారు . 

No comments:

Post a Comment