కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 28 ; ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి వేలాదిగా విద్యార్థులు తరలి వెళ్లాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తున్నదని , విద్యారంగంలో ఉన్న పలు సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికై ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి మండలంలోని విద్యార్థులు వేలాదిగా తరలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పూదరి సాయి, కోశాధికారి కస్తూరి రవీందర్, మండల కార్యదర్శి పర్వతి సాయి, మండల అధ్యక్షులు జాడి సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment