కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 1 : రోడ్డు ప్రమాదం నివరనకు రెబ్బెన ప్రజలు సహకరించాలని రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ కోరారు. మీ కోసం పోలీసులు కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలోని పుంజుమెరుగుడలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కలిగే దుష్ఫలితాలపై కళాజాత ప్రదర్శనలు నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై దికొండ రమేష్ హాజరై మాట్లాడారు. మీకోసం పోలీసులు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని ఒకవైపు శాంతి భద్రతలు కాపాడుతూ మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో పోలీసులకు ప్రత్యేకంగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు మరణంలో జీరో యాక్సిడెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దానిలో భాగంగా ప్రతి రోజు డంకన్ డ్రైవ్ పరీక్షల్లో ముమ్మరంగా చేపడుతున్నానన్నారు. అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే జరుగుతున్నాయని అన్నారు. డ్రన్క్&డ్రాప్ కేసుల నమోదు తొ పాటు మధ్యం సేవించి వాహనాలు నడిపిన వారికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే రోడ్డు ప్రమా ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. అదే తరహాలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలతో పాటు సహకార ఎన్నికలకు ఎంపిటిసి, పార్లమెంట్ ఎన్నికలకు మండలంలో ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకారం ఉండాలన్నారు.
No comments:
Post a Comment