Saturday, 12 January 2019

రెండో రోజు నామినేషన్ల హోరు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  12 : పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది.  మండలంలోని మొత్తం ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉండగా 214 వార్డ్  స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి.  శుక్రవారం నుండి నానవేసిన ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి రోజు సర్పంచ్ స్థానాలకి అధికంగా నామినేసన్ దాఖలు కాగా రెండవ  వార్డ్ స్థానాలకు అధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.  మండలంలో సర్పంచ్ స్థానానికి ముప్పై రెండు నామినేషన్లు దాఖలు కాగా వార్డ్ స్థానాలకు నూట ఇరవై రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.  రెండు  రోజుల్లో సర్పంచ్ స్థానానికి మొత్తం యాభై నాలుగు నామినేషన్లు వార్డ్ స్థానాలకు నూట నలభై రెండు నామనేషన్లు దాఖలు అయినట్లు ఎంపీడీవో ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు.

No comments:

Post a Comment