Thursday, 24 January 2019

గంగాపూర్ జాతర వేలం పాట

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 : రెబ్బెన  మండలంలో ని   సుప్రసిద్ధ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన ఉదయం పన్నెండు గంటలకు జాతర వేలం పాటనిర్వహించనున్నట్లు  ఆలయ ఈవో బాపిరెడ్డి గురువారం తెలిపారు వచ్చే నెల18 వ  తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతర సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయలు,  ప్రసాద తయారీ మరియు విక్రయం,  జాతరలో భాగంగా తై  బజార్,  సైకిల్ స్టాండ్ ల  నిర్వహణ వేలం పాట ఉంటాయని  తెలిపారు.  వేలంలో పాల్గొనే వారు ఇరవై వేలు ధరావతు చెల్లించి బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని తెలిపారు.  ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

No comments:

Post a Comment