కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 1 : రెబ్బెన మండల కేంద్రంలోని దేవలగూడ వద్ద సోమవారం రాత్రి బైక్ ఢీకొని తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన గోవిందుల మహేశ్ (28) అనే లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. రెబ్బెన ఎస్సై దికొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం బొగ్గు టిప్పర్ పై డ్రైవర్గా పనిచేస్తున్న మహేష్ రోజు మాదిరిగానే సోమవారం విధులకు వెళ్లాడు. అదే రోజు రాత్రి తోటి డ్రైవర్ మల్లూరు తిరుపతి, ఎస్కే జాకీర్, రవితో కలిసి రెబ్బెన మండలంలోని దేవుల గొడ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో నంబాల గ్రామానికి చెందిన రాపల్లి వెంకటేశ్ గోలేటి ఎక్స్రోడ్ నుండి రెబ్బెన వైపు మోటార్ సైకిల్ ఫై వస్తున్నాడు బైకుని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహేష్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాద లో మహేష్ తలకు బలమైన గాయాలు కాగా తీవ్ర రక్తస్రావమైంది ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్న తిరుపతి ఎస్కే జాకీర్ లకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రుడ్ని 108 లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మహేష్ మరనిచినట్లు తెలిపారు. మృతుడు అన్న గోవిందుల సంతోష్ అందించిన ఫిర్యాదు మేరకు వెంకటేష్ ఫై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
No comments:
Post a Comment