Monday, 31 December 2018

పోలీసుల ఆధ్వర్యం లో శ్రమదానం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 31:  రెబ్బెన నుండి నంబాల గ్రామానికి వెళ్లే దారి కిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను  పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రెబ్బెన నుంచి నంబాల వెళ్లే మార్గంలో రైల్వే గేట్ దగ్గరనుండి  నంబాల గ్రామంవరకు రోడ్ కు ఇరువైపులా అడ్డదిడ్డంగా  పెరిగిన పిచ్చి చెట్లను రెండు ప్రొక్లయిన్ లు, రెండు ట్రాక్టర్లు, ,    ఆటో డ్రైవర్ల సహాయంతో  శుభ్రం చేశారు. ఈ విధంగా చేయడంవలన రహదారి  మూల మలుపులలో  ఎదురుగా వచ్చే వాహనాలు మరింత  స్పష్టంగా కనపడే వీలుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment