Friday, 11 January 2019

మొదలైన పంచాయతీ నామినేషన్ల పర్వం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  11 :  మొదలైన పంచాయతీ నామినేషన్ల పర్వం. రెబ్బెన మండలంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. సర్పంచ్, వార్డ్ మెంబెర్ పదవుల ఆశావహులు ఎంతో   ఉత్సాహంగా మొదటి రోజు నామినేషన్లు దాఖలు చేశారు.  రెబ్బెన మండలం లో మొత్తం    24 పంచాయతీలు, 214 వార్డ్ లుండగా  ప్రభుత్వ యంత్రాంగం 7 కేంద్రాలలో నామినేషన్ల స్వికరణకు సన్నద్ధమైంది. నామినేషన్ల తొలిరోజు  రెబ్బెన లో సర్పంచ్ స్థానానికి బొడ్డు  ఉజ్వల , పెసర వెంకటమ్మ , బొమ్మినేని అహాల్య దేవి , పి  వరలక్ష్మి  లు దాఖలు చేయగా , వార్డు మెంబర్లు గా  ఉబేదుల్లా , దుర్గ బాయ, జైస్వాల్ వినోద్, అజమేరా రాజేశ్వరి , పివి దుర్గరావు లు నామినేషన్లు దాఖలుచేశారు. కాగా రెబ్బెన మండల కేంద్రములో సర్పంచులుగా 19 నామినేషన్లు, వార్డు మెంబర్లుగా 23 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల సహాయ అధికారి , ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు.

No comments:

Post a Comment