Thursday, 3 January 2019

దళితబస్తీ భూముల కోసం సర్వే

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  03 : దళితబస్తీ భూములను సద్వి వేగం చేసుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి నిరుపేద ఎస్సీ వర్గాల ప్రభుత్వం అందజేసే దళితబస్తీ భూములను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు గురువారం రెబ్బెన మండలంలోని వాంకులం  దళిత బస్తీ భూములను ఆమె పరిశీలించారు గ్రామశివారులోని సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు లో తిరుమల్ రెడ్డి అనే రైతుకు చెందిన  18 ఎకరాల  భూమిని దళిత బస్తీ కింద ఎంపిక చేసేందుకు పరిశీలించారు.  ఈ సందర్భంగా ప్రస్తుతం ఆదే    భూమిలో సాగవుతున్న కంది జొన్న పత్తి పంటలను పరిశీలించి భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను స్వీకరించారు భూసార పరీక్షల ఫలితాల అనంతరం భూమి స్వభావం బట్టి దళిత బస్తీని ఎంపిక చెయ్యాలో వద్దో  రెవెన్యూ అధికారులకు నివేదిక అందచేస్తామన్నారు.  అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందచేస్తుందని  ఆమె అన్నారు.   ప్రభుత్వం అందించే భూములను సాగు చేసుకుంటూ   పేదవర్గాల అభివృద్ధి సాధించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజుల, ఎఇఒ సౌజన్య,  విఆర్వో వాసుదేవ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment