Thursday, 10 January 2019

విద్యార్థులు చిన్ననాటి నుంచే పోటీతత్వాన్నిపెంపొందించుకోవాలి



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  10 :  విద్యార్థులు చిన్ననాటి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించుకుని చదువుపై ఆశక్తి చూపించి  ఉన్నత శ్రేణికి ఎదగాలని రెబ్బెన మండలం తహశీల్ధార్  ఇంతియాజ్ అహ్మద్  అన్నారు. గురువారం   రెబ్బెన మండలంలోని ఎంపీపీఎస్ నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి  పండుగను పురస్కరించుకొని  పిల్లలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని  పిల్లలు వేసిన  సంక్రాంతి ముగ్గులు చూసి పిల్లలను అభినందించారు. ప్రథమ, ద్వితీయ_ తృతీయ బహుమతులను అందజేశారు  తహశీల్ధార్   పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నప్పటినుండి పిల్లలు భారతదేశ సంస్కృతి, పండుగలు గురించి తెలుసుకోవాలని అన్నారు ,ఇప్పటి నుండే పోటీతత్వం అలవర్చుకొని అన్ని రంగాల్లో  ముందుండేందుకు కృషి చేయాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వలశంకర్, ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment