Thursday, 24 January 2019

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 : రెబ్బెన మండలంలోని  ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు శుక్రవారం జరగబోయే పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు.  గురువారం ఉదయమే ఎన్నికల సిబ్బంది మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయనికి చేరుకుని ఎంపీడీవో సత్యనారాయణ సింగ్  ఆధ్వర్యంలో అధికారులు ఎన్నికల సిబ్బందికి గ్రామ పంచాయతీల వారీగా విధులు కేటాయించ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా  ఆరు రూట్లలో ఆ ఆరుగురు జోనల్ అధికారులు,  న్యూటన్ పై రెండు బూత్లకు నోటిపై రెండు మంది పోలింగ్ అధికారులు రెండొందల ఇరవై నాలుగు మంది పీవోలు,  ఇరవై మూడు మంది రిటర్నింగ్ అధికారులు,  పన్నెండు మంది కౌంటర్ ఇన్ ఛార్జ్ లు ,   ఆరుగురు అటెండెన్స్ ఇన్చార్జీలు,  ఆరుగురు స్టేజ్ ఇంచార్జీలు  నిర్వహిస్తున్నారన్నారు.  పంచాయితీ వారిగా కేటాయించిన పీవోలకు,  ఓపీ వోలకు అధికారులకు ఎన్నికల సామాగ్రికి అప్పగించారు.  పోలింగ్ బాక్స్ లు తనిఖీ చేసుకొని   కేటాయించిన వాహనాల్లో  పంచాయతీల కు తరలివెళ్లారు.  సిబ్బంది ఎన్నికల్లో విధులు కేటాయింపుతో పాటు సామగ్రి అప్పగింత కార్యక్రమాలను జేసీ రాంబాబు దగ్గర నుండి పరిరక్షించారు సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని అన్నారు.

No comments:

Post a Comment