Thursday, 3 January 2019

కుమ్మరి వృత్తిదారులకు ప్రోత్సహించి పెన్షన్ అందించాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  03 : కుమ్మరి వృత్తిదారులను  ప్రభుత్వం ప్రోత్సహించి యాభై సంవత్సరాలు నిండిన వారికి 5000  పెన్షన్ అందించాలని కుమ్మరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం రెబ్బన మండలం గోలేటి లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర వృత్తికి ఆధునిక పద్ధతుల్లో అధునాతన యంత్రాలతో శిక్షణ ఇచ్చి కుమ్మరులకు ఆర్థిక జీవనోపాధికి కృషి చేయటం అభినందనీయమన్నారు.  అందుకు ప్రోత్సహించిన కెసిఆర్ కు  కృతజ్ఞతలు తెలిపారు.  వెంటనే కొత్త జీవోలను తీసుకువచ్చి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వంట చెరుకు సాగు చేసుకునేందుకు ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని అన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో కుమ్మరి  సంఘాల శిక్షణ కేంద్రాలను  ఏర్పాటు చేసి రెండెకరాల భూమిని కేటాయించాలని,  యంత్రాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.  ఈ సమావేశం లో  కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి మల్లేష్,  జిల్లా ప్రధాన  కార్యదర్శి కటికన మొండి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం సంతోష్,  యూత్ నాయకులు ఉప్పులేటి మల్లేష్,  ఎర్ర సురేష్ పాటు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment