Tuesday, 1 January 2019

సమిష్టి కృషితో వార్షిక లక్ష్యాన్ని సాధిద్దాం : రవిశంకర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  1:  కార్మికులు అధికారులు సమిష్టి  కృషితో వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే రవిశంకర్ అన్నారు.  మంగళవారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లోని  జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో  ఆయన మాట్లాడారు.  బెల్లంపల్లి ఏరియాలో ఉత్పత్తి రవాణాలోనూ పది శాతం వృద్ధి  సాధించామన్నారు.  గత సంవత్సరంలో సింగరేణి అరవై రెండు మిలియన్ టన్ను సాధించగా ఈసారి అరవై ఆరు మిలియన్ టన్ను సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.  ఉత్పత్తి తో  పాటు రవాణాలో  సాధిస్తున్న రికార్డులలొ కార్మికుల కృషి నిదర్శనమన్నారు.  రైల్వే శాఖ సహకారంతో అత్యధికంగా బొగ్గు రవాణాను చేపడుతుండడంతో పాటు అన్ని విద్యుత్ సంస్థలకు  కావలసిన బొగ్గును సకాలంలో అందచేస్తున్నామని అన్నారు.  కొత్త ప్రాజెక్టు కోసం పర్యావరణ  అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.  ఉత్పత్తితో పాటు కార్మిక సంక్షేమ సంక్షేమానికి అదే తరహాలో ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఇరవై ఏడు శాతం లాభాలలో  వాటా అందించమన్నారు.  ప్రతి ఇంటికి ఏ  సి  సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులని  తేడా లేకుండా కార్మికులందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు రూపాయలు పది లక్షల రుణంపై వడ్డీని చెల్లించేందుకు సర్క్యులర్ సైతం విడుదలైనట్లు తెలిపారు.   కారుణ్య నియామకాలను అమలు చేస్తున్నామని అందులో  భాగంగా ఏరియాలో నూటఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా తొంభై మందికి ఇన్వాలిడేషన్ లభించినట్లు తెలిపారు.  నలభై ఒక్క మంది కార్మికుల వారసులకు ఆర్డర్స్ సైతం అందించామన్నారు.  మాధారంలో లైబ్రరీ  క్లబ్లు సైతం  రే ఓపెన్ చేస్తున్నామన్నారు. .త్వరలోనే అంతర్గత రోడ్ లకు సైతం మరమ్మతులు చెడుతున్నాట్లు తెలిపారు. గోలేటి ఓ సి పి  , చింతగూడ, మాదారం ఓ సి లకోసం ముమ్మారు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2018 లో కొన్ని ఒడిడుకులు కలిగినప్పటికీ ప్రేత్యేక చర్యలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తికై ప్రయత్నించాలని అన్నారు.  ఈ  సమావేశం లో ఎస్ ఓ టూ జీఎం  సాయిబాబా, డిజిఎం  పెర్సొన్నల్  జ్ కిరణ్, డీపీఎం రాజేశ్వర్, డిజిఎం  ఐ ఈ డి యోహాన్ తదితరులు పాల్గొన్నవారు.

No comments:

Post a Comment