Friday, 4 January 2019

సావిత్రీబాయి పూలే సేవలు దేశంలోనే ఎనలేనివి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  04 :  సావిత్రీబాయి పూలే  దేశంలోనే మొట్టమొదటి మహిళా  ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొంది ఎనలేని సేవలు చేశారని పూలే సేవా సమితి అధ్యక్షులు మోహర్లె శ్రీకాంత్ అన్నారు రెబ్బనలోని  నౌవగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.  అనంతరం మాట్లాడుతూ  బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కిందికులాలను బానిసలుగా చూస్తున్న ఆ రోజుల్లో బహుజనుల కోసం బడి పెట్టి పాఠాలు చెప్పిన చదువుల తల్లి సావిత్రి భాయిఫూలే. అని అన్నారు. మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటి పాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే. అని అన్నారు.  ఈ కార్యక్రమంలో కార్యదర్శి తిరుపతి, కోశాధికారి పోచయ్య, సుభాష్, జగదీష్, తులసీరాం, భీమ్రావు, శ్రీకాంత్, ప్రధాన ఉపాధ్యాయులు దేవులు, ఉపాధ్యాయులు  ధర్మేందర్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment