Saturday, 5 January 2019

ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

  
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  05 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు డబ్బుకు మందుకు మరియు ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్  రవిశంకర్ అన్నారు.  రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ లొని సింగరేణి హైస్కూల్ పిల్లలతో బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి కాలనీలలో మరియు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొని  మాట్లాడుతూ  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు  వినియోగించుకోవాలని  అన్నారు. సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ  జరగబోయే టువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో  ఓటర్లు  ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి పాటుపడేవారికి   ఓటు వేయాలని కోరారు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే వచ్చే నాయకుల కన్నా నిజాయితీగా ఉండే నాయకులను ఎన్నుకోవాలని వారు అన్నారు. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి జిఎం కిరణ్ కుమార్,   రాజేశ్వర్ , రమేష్  సేవా సంస్థ  ప్రధాన కార్యదర్శి గజ్జల సత్యనారాయణ,  ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్,  రవీందర్ కార్యదర్శులు పెంట పర్తి తిరుపతి,  వేల్పుల తిరుపతి,  బలుగూరి  తిరుపతి,  జనగామ విజయ్,  సభ్యులు రాజశేఖర్ , సాయికిరణ్ , కృష్ణ,  సింగరేణి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment