కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 24 ; రెబ్బెన మండలంలోని అన్ని పంచాయతీల్లో శుక్రవారం జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణమూర్తి పోలీస్ సిబ్బందికి సూచించారు. మండలంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పోలీసుసిబ్బందితో ఆయన మాట్లాడుతూ మండలంలోని ఇరవై మూడు పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి తగిన భద్రత కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా అమలు చేయాలన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ముగ్గురు సిఐలు, ఐదుగురు సబ్ ఇన్సపెక్టర్ లు, 120 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సబ్ ఇన్సపెక్టర్ దీకొండ రమేష్ , లింగాపూర్ ఎస్సై తిరుపతి, వాంకిడి ఎస్సై చంద్రశేఖర్ లు ఉన్నారు.
No comments:
Post a Comment