Saturday, 26 January 2019

సింగరేణి సంస్థకు సమిష్టిగా అంకిత భావంతో సహకరించాలి ; జి ఎం కే రవి శంకర్


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  26 ; సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు సమిష్టిగా సింగరేణి పురోభివృద్ధికి పునరంకితం  కావాలని బెల్లంపల్లి రిజనల్ మేనేజర్ కే రవి  శంకర్ అన్నారు.   బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్ షిప్ లో  శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.   జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బి అర్  అంబెడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం భీమన స్టేడియంలో సింగరేణిఎస్ అండ్ పి ,     సిఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థుల గౌరవవందనాన్ని స్వీకరించారు.  అనంతరం  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలకపాత్ర పోషిస్తోందన్నారు దక్షిణ భారతదేశంలోని విద్యుత్ సంస్థలకు  సరిపడా బొగ్గును అందచేస్తూ విద్యుత్ కాంతులు  వెదజల్లేందుకు కృషిచేస్తుందన్నారు.  ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా  సంస్థ పనిచేస్తుందన్నారు.  కారుణ్య నియామకాలను పకడ్బందీగా అమలు చేస్తే కార్మికుల వారసులకు ఉద్యోగులకు అందిస్తుందన్నారు.  అదే తరహాలో కార్మికు  ల  క్వార్టర్ల ఆధునీకరణతో పాటు పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తుందన్నారు.  ఏరియాకు నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని సాధనకు ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు.  అనంతరం ఏరియాలో ఎంపికైనా ఉత్తమ కార్మికులను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు అనురాధశివశంకర్,  డిజిఎం పర్సనల్ కిరణ్ డీవైపీఎంలు సుదర్శనం,  రాజేశ్వర్,  రామశాస్త్రి,  అధికారులు, కార్మిక సంఘాల   అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment