Friday, 18 January 2019

గాలి కుంటు వ్యాధి టీకాలను వేయించాలి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18  పశువులకు గాలి కుంటు  వ్యాధి టీకాలను వేయించాలని  ఆసిఫాబాద్ జిల్లా  పశు వైద్యాధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని ఎడవెల్లి గ్రామంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలను వేయించడం జరిగిందని అన్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ తప్పని సరిగా టీకాలను పశువులకు వేయించాలని అన్నారు. వచ్చే వేసవి కాలంలో పశువుల మేతకోసం ఇబంది పడకుండా గడ్డి జొన్న విత్తనాలను సబ్సిడీ పై మండలాలలో అందుబాటులో ఉంటాయని , వీటి కోసం మండల పశు వైద్యాధికారులను సంప్రదించాలని అన్నారు. జిల్లాలో 20 వ పశు గణన  జరుగుతున్న సందర్హంగా  రైతులు తమ పశువుల వివరాలను ఏరియా విషయం సేకరణ దారులకు తెలియ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సంజీవ్ కుమార్, రెబ్బెన మండల పశు వైద్యాధికారి   సాగర్, సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment