కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 04 : ఉపాద్యాయులు,విద్యార్థుల హాజరు నమోదు ని బయో మెట్రిక్ ద్వారా ప్రతి రోజు వెయాలని మండల విద్యాధికారి యం.వెంకటేశ్వర స్వామి సూచించారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంతర సమగ్ర మూల్యాంకన మార్కుల ని చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేయాలని అన్నారు. స్కావెంజర్ పాఠశాల సమయాలలో అందుబాటులో ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులకి డిఇఓ గారి ఆదేశానుసారం స్నాక్స్ బిస్కెట్ అందించాలని సూచించారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము పాఠ్యాంశాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బడి బయట పిల్లలని గుర్తించి పాఠశాలకు తీసుకురావాలన్నారు.
No comments:
Post a Comment