Tuesday, 8 January 2019

అక్రమ అరెస్ట్ లకు నిరసనగా అంబెడ్కర్ విగ్రహానికి వినతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  08 : నిరసన కార్యక్రమాలకు అనుమతులిచ్చి నాయకులను అక్రమంగా అరెస్ట్    చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులూ మహమ్మద్ చాంద్ పాషా మంగళ వారం రెబెనా మండలం గోలేటిలోని అంబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం  చేయడానికి  నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తక్షణమే బేషరతు గా వారందరిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, బాపు, కే సాగర్, జ్ శంకర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment