Thursday, 31 January 2019

టి డబ్ల్యూ జె (ఐ జె యు) కేలండర్ ఆవిష్కరణ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  31  తెలంగాణా యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐ జె  యు) క్యాలెండర్ ను గురువారం   రెబ్బెన  ఎస్సై దీకొండ రమేష్ ఆవిష్కరించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమిల్ల సంపత్ కుమార్,  ఆర్గనైజింగ్ సెక్రటరీ  కె.సునీల్ కుమార్,  సంయుక్త కార్యదర్శి డి.శ్రీనివాస్.  పాత్రికేయులు. పోచయ్య, జె  సత్యనారాయణ, సంజీవ్ కుమార్, వినయ్,దాస్ బాబు, చంద్రశేఖర్ లు  గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ ను  శాలువా  తో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను కాపాడుతూ  పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలో పలు సేవా కార్యక్రమమాలు నిర్వహించారన్నారు. 

No comments:

Post a Comment