Saturday, 26 January 2019

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేప రెపలాడిన మువ్వన్నెల జెండా



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  26  గణతంత్ర దినోత్సవం సందర్భంగా   రెబ్బన మండలంలో  మువ్వన్నెల జెండా శనివారం  రెప రెపలాడింది. జాతీపిత  మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావు అంబెడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.రెబ్బెన మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో, పాఠశాలల్లో  రిపబ్లిక్ డే ను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులు ఉదయం మండల కేంద్రంలోని ప్రధాన వీధులగుండా క్రమశిక్షణతో వెళుతూ దేశభక్తి నినాదాలను, దేశ  స్వాతంత్ర్యం కోసం పాటుపడినవారిని స్మరిస్తూ నినాదాలను చేశారు.   . తహశీల్ధార్ కార్యాలయములో డిప్యూటీ  తహశీల్ధార్ నాగోరావ్  , ఎంపిడిఓ కార్యాలములో ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ , ఎం ఈ ఓ ఆఫీసులో  ఎం ఈ  ఓ వెంకటేశ్వర స్వామి  ,  ఐకెపి లో ఏ పీఎం వెంకట రమణ , గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ, నక్కలగూడా ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కల్వల  శంకర్, మండలంలోని అన్ని పంచాయతీలలో సెక్రటరీలు ,  వివిధ పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు,  పాఠశాలల్లో ప్రధానోపాద్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు .

No comments:

Post a Comment