కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 05 : జనవరి 8, 9 తేదీలలో కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్ఎఫ్ కొమురం భీం జిల్లా సమితి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె చేపడుతున్నారని అన్నారు. కార్మిక హక్కులను హరించే విధంగా చట్టాలను సవరిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment