Saturday, 5 January 2019

దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  05 : జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 8,9 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం  కే రవిశంకర్ అన్నారు. శనివారం రెబ్బెన మండలం గోలేటి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపినిచ్చిన సంఘాల ప్రధాన డిమాండ్లయినా బొగ్గు పరిశ్రమలో కమర్షియల్ మైనింగ్ నిలుపుదల, బొగ్గు పరిశ్రమలో వాటాల విక్రయం, కార్మిక చట్టాలను మార్చరాదని, ఔట్సోర్సింగ్ చేయకూడదని, మరియు అధిక ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. పై డిమాండ్లన్నీ కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశాలని, రాష్ట్రప్రభుత్వంకాని, సింగరేణి సంస్థకాని వాటిపై నిర్ణయం  తీసుకోజాలవని అన్నారు. సమ్మె చేయడంవలన కార్మికులు వ్యక్తిగతంగా కేవలం బెల్లంపల్లి ఏరియా లోనే సుమారు 50 లక్షల వరకు వేతనాల రూపంలో కోల్పోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం సింగరేణి సంస్థకాలసి ఖర్చుకు వెనుకాడకుండా చేస్తున్న సంక్షేమ పథకాలకు  విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు అందచేస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, బొగ్గు సరఫరాకు అనేక సంస్థలతో చేసుకున్నఒప్పందాల ప్రకారం సరఫరా చేయలేక సంస్థకు చెడ్డపేరు వసుతుందని అన్నారు. సంస్థ ఆర్ధికంగా నష్టపోతుందని అన్నారు.  కావున కార్మికులు ఆలోచించుకొని సమ్మెకు దూరంగా ఉండాలని కోరారు.

No comments:

Post a Comment