కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 18 ; రెబ్బెన మండలం లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు గత 5 నెలలుగా జీతాలు అందడంలేదని మండల అధ్యక్షులు బి అనిత, మండల సెక్రటరీ ఎం సుకన్యలు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఆశ వర్కర్లతో వారికి కేటాయించిన పనులే కాకుండా వివిధ రకాల సర్వే పనులకు తగిన అదనపు వేతనం అందచేస్తామని పురమాయించి వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు .ఉదాహరణకు లెప్రసి సర్వే, ఎలక్షన్ లలో వికలాంగులను పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకు వచ్చే భాద్యతను అప్పగించి, తీరా ఎలెక్షన్లు అయిన తరువాత చేసిన అదనపు పనికి పారితోషికం అడిగితె జిల్లా వైద్యాధికారి కార్యాలయం వారు ప్రభుత్వం నుండి డబ్బులు అందలేదని అంటున్నారని ఆరోపించారు. గత 5 నెలలుగా జీతభత్యాలు అందక పస్తులుండవలసిన పరిస్థితి దాపురించిందని కావున ఇకనైనా ప్రభుత్వం తమకు రావలసిన జీతభత్యాలను తక్షణం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కే రమా దేవి, మండల ఆశావర్కర్లు రాజేశ్వరి, నిర్మల, పద్మ, స్వప్న, కే రాజేశ్వరి, ఎస్ రాజేశ్వరి, సుజాత, భాగ్య, సుజాత, సరోజినీ, లక్ష్మి, విమల, వి పద్మ, అమృత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment