కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 31 ; ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నియంత్రించి వాటి స్థానంలో పేపర్ సంచులను వినియోగించాలని గోలేటి స్పోర్ట్స్ లయన్ క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరెడ్డి అన్నారు. గురువారం రెబ్బెన లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోలేటి గ్రామంలోని గురువారం వారసంతలో ప్రజలకు పేపర్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల వాడకం పర్యావరణానికి తీవ్ర విఘాతంగా మారుతుందని ప్లాస్టిక్ సంచుల తయారీకి ఉపయోగించే రసాయనాలు మానవాళితో పాటు పర్యావరణానికి తీవ్ర విఘాతం అని అన్నారు. కాగితం మట్టిలో కలిసిపోయేందుకు దాదాపుగా నెల రోజుల సమయం సరిపోతుంది. కానీ అదే ప్లాస్టిక్ భూగర్భంలో కలిసి పోయేందుకు 20 మిలియన్ సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అంటే ప్రస్థుతం మనం వాడిపడేసిన,వాడుతున్న ప్లాస్టిక్ భూమిలో కరిగేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి, దీన్ని బట్టి ఏ స్థాయిలో ప్లాస్టిక్ మానవాళికి పెనుముప్పుగా మారుతుందన్నారు. పేపర్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రజలు కూడా మార్కెట్ కి వెళ్ళినప్పుడు గుడ్డతో కుట్టిన చేతి సంచి తీసుకోని వెళ్లే అలవాటును పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ భాస్కర్, లయన్ వీఎస్ఆర్ మూర్తి, లయన్ సత్యనారాయణ, నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment