Thursday, 24 January 2019

బాలికల సంరక్షణ ఐసిడిఎస్ సిబ్బంది ధ్యేయం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 : బాలికల సంరక్షణ ధ్యేయంగా ఐసిడిఎస్ సిబ్బంది పనిచేయాలని సిడిపిఒ డి  నాగలక్ష్మి అన్నారు గురువారంరెబ్బెన లోని  గోలేటి పంచాయతీ పరిధిలో మూడవ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో బాలికలపై వివక్షత పెరిగిపోతుందని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందికర  పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.  బాలికల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.  ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాలికలకు చేయూతను అందించాలనే లక్ష్యంతో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని చేపట్టి బాలికల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారన్నారు.  లింగవివక్షతను నిర్మూలించేందుకు బాలికలకు చిన్నతనం నుండి తాము కూడా బాలురతో  సమానమే అనే  భావాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.  పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటం ద్వారా బాలికల్లో పెరుగుదల సక్రమంగా ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్  డి కిరణ్మయి ,  గ్రేడ్ వన్ సూపర్వేజర్ చిట్టెమ్మ,  సూపర్ వైజర్ సరోజిని దేవి,  అంగన్వాడి టీచర్లు స్వర్ణలత,  సుశీల,  భాగ్యలక్ష్మీ,  రుక్మిణితో పాటు బాలింతలు,  కిశోర బాలికలు తల్లులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment