కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 06 : కేంద్ర కార్మిక సంఘాల త్వరలోనే ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు సైతం పాల్గొనాలని మధ్యాహ్న భోజన సంఘం జిల్లా కార్యదర్శి పాగిడి మాయ అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం కార్మికుల లకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమ్మెలో మధ్యన కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సోమవారం సమ్మెకు సంబంధించిన నోటీసును విద్యాధికారికి అందజేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న కార్మికులకు కనీసవేతనం 18వెలు ఇవ్వాలన్నారు. తదితర డిమాండ్లపై చర్చించారు ఈ కార్యక్రమంలో ఈ పద్మ, విజయ, భూమక్క, పోచెక్క, హసీనా, ఈశ్వరి, లక్ష్మి, స్వరూప, తాను బాయి తదతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment